Login to HTCA
Please fill the below credential
ప్రతి దేశ అభివృద్ధి ఆ దేశపు సంసృతి సాంప్రదాయాలపై ఆధారపడి ఉంటుంది. సంస్కృతికి పునాది సాహిత్యం. ఆ సాహిత్య విలువలను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళేది ఆ జాతి భాష. ఒక జాతి యొక్క ఆలోచనపరిపక్వత స్థితి వారి మాతృభాష పరిపూర్ణత చూసి తెలుసుకోవచ్చు.
తెలుగుభాష ఉన్నతమైన ప్రపంచభాషల్లో ఒకటి. తెలుగుభాష ఒక పరిపూర్ణమైన భాష. అలంకర శోభితమైనది, సుందరము మరియు మధురమైనది. సరళమైన పదజాలములతో పాటు గంభీరమైన ప్రభందకావ్యములకు కావలసిన వ్యాకరణము మరియు సంపూర్ణమైన పదకోశాన్ని కలిగిఉన్నది.
అందమైన తెలుగుభాషా సౌరభాన్ని ఆస్వాదించడానికికోసం మన హ్యుస్టన్ నగరంలో ఒక వేదికను ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో 2008 సంవత్సరం అక్టోబర్ మాసంలో అప్పటి తెలుగుసాంస్కృతిక సమితి అధ్యక్షురాలు శ్రీమతి సంగీత వెన్నెలకంటి గారి సహకార సహాయాలతో “హ్యుస్టన్ సాహితీలోకం” అనే ఒక సాహితివేదిక స్థాపించబడినది.
సాహితిప్రియులు ప్రతినెల ఒకసారి కలుసుకొని తెలుగుసాహిత్యగోష్టి చేసుకొంటారనే ఉద్దేశ్యంతో శ్రీ వంగురి చిట్టెన్రాజుగారు ఈ గోష్టికి “నెల నెలా తెలుగువెన్నెల” అనే నామకరణం చేసారు. ఈ వెన్నెలకు శ్రీ అక్కిరాజు సుందరరామకృష్ణ గారు మొట్టమొదటి విశిష్ట అతిధి.
అప్పటినుంచి ఇంచుమించు ప్రతినెల ఒకరోజు సాహితి గోష్టి జరుగుతూనేఉంది. హ్యుస్టన్ సాహితిలోకం తెలుగు సాంస్కృతిక సమితిలో అంతర్భాగంగా అభివృద్ధి చెందుతోంది
శ్రీ గొల్లపూడి మారుతీరావు, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, శ్రీ భువనచంద్ర, అవధాని మేదసాని మోహన్, మహాకవి శ్రీ శ్రీ సతీమణి శ్రీమతి సరోజ, జానపదరాణి శ్రీమతి వింజమూరి అనసూయ, ప్రముఖ సినీనటుడు జొన్నలగడ్డ రమణమూర్తి, ప్రజాకవులు శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ గోరేటి వెంకన్న, శ్రీ అందెశ్రీ మొదలగు పున్నమిచంద్రులతో తెలుగు వెన్నెల నెల నెలా శోభిల్లుతూ సాగుతున్నది.
ప్రస్తుతం ప్రతినెల మూడవ ఆదివారం శ్రీ అష్టలక్ష్మి దేవస్థాన ప్రాంగణములో మధ్యాహ్నం రెండు గంటలనుండి తెలుగు వెన్నెల కురుస్తుంది.
ప్రతినెల కలవడమే కాకుండా groups.google.com/HoustonSahitilokam అనే గూగుల్ గ్రూప్ లో కూడా రోజు అంతర్జాలంలో చక్కటి సాహితీచర్చ జరుగుతుంది.
వెన్నెలలో గతంలో జరిగిన కొన్ని సాహితి ప్రసంగాలను www.youtube.com/user/HoustonSahitilokam/ అనే YouTube చానల్ లో చూడవచ్చు